ఆర్ఆర్ఆర్ మూవీ మీద ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్

ఆర్ఆర్ఆర్ మూవీ మీద ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని యావత్ సినీ జనం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా, చాలా సినిమాలు సంక్రాంతి శుభాకాంక్షలతో కొత్త సినిమా అప్‌డేట్‌లు ఇచ్చారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఆర్ఆర్ఆర్' యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' యూనిట్‌పై సెటైర్లు వేస్తున్నారు.