కేరళకు పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన ఎన్టీఆర్ !

కేరళకు పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించిన ఎన్టీఆర్ !

కేరళ వరద బాధితులకు సహాయం చేయడంలో తెలుగు సినీ తారలు, ప్రముఖులు చాలా చొరవ చూపిస్తున్నారు.  ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి హీరోలు తమ సహాయాన్ని ప్రకటించగా తాజాగా తారక్, కళ్యాణ్ రామ్ లు కూడ ఆ జాబితాలో చేరారు. 

ఎన్టీఆర్ తన వంతుగా కేరళ భాదితుల సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా తన సహాయంగా 10 లక్షల రూపాయల్ని కేరళ సిఎం రిలీఫ్  ఫండ్ కు అందించేందుకు ముందుకొచ్చారు.  ఇలా మన హీరోలు ఒకరి తర్వాత ఒకరు తమ మంచి మనసును చాటుకుంటుండటం హర్షించదగిన విషయం.