ఎన్టీఆర్ జయంతి రోజు జూనియర్ అసహనం...!

ఎన్టీఆర్ జయంతి రోజు జూనియర్ అసహనం...!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్... తాత జయంతి అయినా, వర్ధంతి అయినా.. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు తన సోదరుడు కల్యాణ్‌ రామ్‌తో కలిసి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్... ఎన్టీయార్ ఘాట్ వెలవెలబోవడం చూసి షాక్ అయ్యారు. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంపై ఇద్దరు మనవళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీయార్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఎప్పుడూ పుష్పాలతో కలకలలాడే ఘాట్.. ఒక్క పువ్వు కూడా లేకుండా వెలవెలబోవడంపై ఆవేదన చెందిన జూనియర్ ఎన్టీఆర్... వెంటనే తన ఫ్యాన్స్‌తో భారీగా పుష్పాలను తెప్పించి స్వయంగా తాత సమాధిని అలంకరించారు. అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కలకలలాడేలా చేశారు. తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని తారక్ చెప్పినట్టు ఆయన అభిమానులు వెల్లడించారు.