18 ఏళ్ల అనుబంధాన్ని షేర్ చేసుకున్న ఎన్టీఆర్‌, రాజమౌళి

18 ఏళ్ల అనుబంధాన్ని షేర్ చేసుకున్న ఎన్టీఆర్‌, రాజమౌళి


జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం రిలీజై ఈరోజుకి  18 ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలు ఒకే విషయాన్ని ట్వీట్ చేశారు. అది కూడా ఒకే సమయానికి. ‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాలో చాలావరకు రామోజీ ఫిలిం సిటీ లొకేషన్లను వాడుకున్నారు. దీంతో అదే లోకేషన్స్ కి వెళ్ళిన ఇద్దరూ పిక్స్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చంగా ఆనాటి ఫోటోలో ఉన్నట్టే ఇప్పుడు లేటెస్ట్‌గా ఫొటోలు దిగి, వాటిని సోషల్‌ మీడియాలో ఇద్దరూ పోస్ట్‌ చేశారు. 18 ఏళ్లు! సరిగ్గా ఇదే రోజున స్టూడెంట్ నెం.1 రిలీజైంది.

కాకతాళీయంగా మేము రామోజీ ఫిలింసిటీలో ఉన్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, ఎన్టీఆర్ సన్నబడ్డాడు, నేను వయసు పైబడ్డాను" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ పోస్టు చేసిన తరహాలోనే స్టూడెంట్ నెం.1 షూటింగ్ నాటి ఓ పిక్ ను పోస్టు చేసి దాని కింది భాగంలో లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేశారు. 18 ఏళ్లప్పడు స్టూడెంట్ నెం 1 సంచలన విజయం సాధించింది. 2001 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కు హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నాడు.