తనయులతో తారక్ తాజా ఫోటో

తనయులతో తారక్ తాజా ఫోటో

ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. పిల్లలతో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నాలుగు రోజుల క్రితమే తారక్ కు రెండో కొడుకు పుట్టాడు. బాబును ఇంటికి తీసుకొచ్చాక పెద్ద కొడుకు అభయ్ రామ్ చేతుల్లో పెట్టి ఎన్టీఆర్ ఓ ఫోటో తీశాడు. ఆ ఫోటో తీస్తుండగా జూనియర్ భార్య లక్ష్మీ ప్రణతి వీళ్ల ముగ్గురిని క్లిక్ మనిపించింది. ఆ ఫోటోని ఇన్‌స్టాలో పెట్టిన తారక్ దాని లింక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఆకతాయిల గుంపులోకి కొత్త ఆకతాయికి స్వాగతం అంటూ బ్రాట్, బ్రాట్ ప్యాక్ అంటూ హ్యాండిల్స్ పెట్టాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ లోనైతే భవిష్యత్తులో ఆకతాయి కుర్రాళ్లతో తనకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో ఈ ఫోటో తీసిన అమాయక తల్లికి తెలియదు పాపం అంటూ చిలిపి కామెంట్ పెట్టాడు. కొన్ని గంటల క్రితమే పెట్టిన ఈ పోస్టులకు జూనియర్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అభిమానుల లైకులు, షేర్లు, కామెంట్లతో మోత మోగిపోతున్నాయి. లక్షలాది మంది తారక్ కు తమ శుభాకాంక్షలు చెబుతున్నారు.