చరణ్ ఫోటోని షేర్ చేసిన ఎన్టీఆర్

చరణ్ ఫోటోని షేర్ చేసిన ఎన్టీఆర్

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'మెగా పవర్ స్టార్' రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఫోటోని షేర్ చేశాడు. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు, ద‌ర్శ‌కులు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఒక హీరో ఫంక్షన్ కి మరొక హీరో వెళ్లడం.. తాజాగా ద‌ర్శ‌కులు అందరూ కలిసి పార్టీ జ‌రుపుకోవ‌డం వంటివి అభిమానులను ఖుషి  చేస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు ఇటీవ‌ల‌ తరుచూ కలిసి స‌ర‌దాగా గడుపుతున్నారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో.. సీనియ‌ర్ ఎన్టీఆర్ ఫోటో చూస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫోటోని షేర్ చేశాడు. అంతేకాదు దీనికి 'మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ' అని ఓ కాప్షన్ ను రాసాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనికి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్‌లో న‌టించ‌నున్నారు.