అభిమానులతో తారక్ సంబరాలు !

అభిమానులతో తారక్ సంబరాలు !

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం భాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తోంది.  కొన్ని చోట్ల నా బాహుబలి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా త్వరలోనే తారక్ కెరీర్లోనే ఉత్తమ వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుంది.  దీంతో తారక్ ఈ విజయాన్ని అభిమానులతో కలిసి  సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. 

అందుకే ఈ నెల 21న హైదరాబాద్లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు.  సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.