'జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో' రేపటి నుంచే..

'జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో' రేపటి నుంచే..

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి ఈ స్టేషన్‌ అందుబాటులోకి వస్తుందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ - హైటెక్‌సిటీ మార్గంలో అన్ని స్టేషన్లూ అందుబాటులోకి వచ్చినట్టే. అమీర్‌పేట - హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20న ప్రారంభమవగా రాగా.. ఆ సమయంలో 5 స్టేషన్లే అందుబాటులోకి వచ్చాయి. దశల వారిగా మాదాపూర్‌, పెద్దమ్మగుడి స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.