చ‌పాతీ పిండిలో విషం పెట్టి మ‌హిళ కుట్ర‌, జ‌డ్జి స‌హా ఇద్ద‌రు మృతి

చ‌పాతీ పిండిలో విషం పెట్టి మ‌హిళ కుట్ర‌, జ‌డ్జి స‌హా ఇద్ద‌రు మృతి

కోపంతో ర‌గిపోయిన ఓ మ‌హిళ‌.. మొత్తం జ‌డ్జి కుటుంబాన్ని అంతం చేయాల‌నుకుంది.. ప‌థ‌కం ప్ర‌కారం చ‌పాతీ పిండిలో విషం క‌లిపి ఆ ఇంటికి చేరేలా చేసింది.. దీంతో న్యాయమూర్తి, అతడి కుమారుడు మృతిచెందారు.. మొద‌ట‌ అనుమానాస్పద మృతిగా కేసు న‌మోగు చేసినా..  విషం కలిపిన చపాతీలు తినడం వల్లే ఇద్దరూ చనిపోయినట్టు తేల్చారు.. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  చింద్వారా జిల్లాలో ఎన్జీవో నడుపుతున్న 45 ఏళ్ల సంధ్యా సింగ్ అనే మహిళతో.. ఛింద్వారా జిల్లా న్యాయమూర్తి  మహేంద్ర త్రిపాఠీకి పరిచయం ఏర్పడింది.. అది కాస్త స్నేహంగా మారింది.. అయితే.. క‌రోనా లాక్‌డౌన్ కారణంగా గత 4 నెలల నుంచి త్రిపాఠీని కలవని సంధ్యా సింగ్.. కోపం పెంచుకుంది.. ఆయ‌న కుటుంబంతో కలిసి బేతుల్‌లో ఉన్నాడ‌ని తెలిసి.. మొత్తం కుటుంబాన్ని అంతం చేయాలని కుట్ర చేసింది.

తాను మీ కోసం పూజచేశానని, మంత్రించిన ఈ గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే అన్ని సమస్యలు తీరిపోతాయని నమ్మబలికి విషం కలిపిన చ‌పాతీ పిండి వారి ఇంటికి చేరేలా చేసింది. జులై 20న న్యాయమూర్తి మహేంద్ర త్రిపాఠీ ఆ గోధుమ పిండిని తీసుకురాగా.. ఆయన భార్య అదే రోజు చపాతీలు చేసింది. ఈ చపాతీలు తిన్న మహేంద్ర త్రిపాఠీ, ఆయన ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంట‌నే ఆ ముగ్గురినీ ఆస్ప‌త్రి త‌ర‌లించ‌గా.. జడ్జ్, అభియన్ రాజ్ పరిస్థితి విష‌మంగా ఉండ‌డంతో.. ఈ నెల 25వ తేదీన నాగ్‌పూర్‌కి త‌ర‌లించారు.. అయితే, అభియన్ మార్గమధ్యలోనే మృతి‌చెంద‌గా.. మహేంద్ర త్రిపాఠీ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర్నాడు క‌న్నుమూశాడు.. ఇక‌, భార్య మాత్రం ఆ రోజు రైస్ తినడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. త్రిపాఠీ చిన్న కుమారుడు ఆశిష్ చపాతీలు తిన్నా.. ప్రస్తుతం అతడి పరిస్థితి కొంత నిల‌క‌డ‌గా ఉంద‌ని వెల్ల‌డించారు. నాగ్‌పూర్ వెళ్లినప్పుడు తన తండ్రికి సంధ్యా సింగ్ ఈ గోధుమ పిండి ఇచ్చినట్టు ఆశిష్ తెలిప‌డంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. కేసును ఛేధించారు.. ఈ ఘటనలో ఓ మహిళ, ఓ మాంత్రికుడు సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. న్యాయమూర్తి కుటుంబాన్ని అంతంచేయాల‌న్న త‌న ప్లాన్‌లో భాగంగానే సంధ్యా సింగ్ విషం కలిపిన గోధుమ పిండి ఇచ్చిందని ఛింధ్వారా ఎస్పీ సిమ్లా ప్రసాద్ తెలిపారు.