స‌ల్మాన్ బెయిల్ డిలే అందుకే...

స‌ల్మాన్ బెయిల్ డిలే అందుకే...
కృష్ణ జింకల‌ వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు విధించిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండ్రోజులుగా స‌ల్మాన్ జైల్లోనే ఉన్నారు. ఆ క్ర‌మంలోనే అత‌డి లాయ‌ర్లు బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. నిన్న‌టి రోజున బెయిల్ వ‌చ్చేస్తుంద‌నే భావించారంతా. కానీ అప్ప‌టికే స‌మ‌యం అయిపోవ‌డం వ‌ల్ల బెయిల్ ప్లీ ప‌రిశీలించ‌డం కుద‌ర‌లేదు. దాంతో స‌ల్మాన్ భాయ్ ఎదురు చూపులు ఫ‌లించ‌లేదు. స‌ల్మాన్ బెయిల్ ఆల‌స్యానికి వేరొక కార‌ణం ఉంది. ప్ర‌స్తుతం ఈ కేసు విచారిస్తున్న జ‌డ్జి అత్య‌వ‌స‌రంగా వేరొక చోటికి బ‌దిలీ అవ్వ‌డంతో ప్లీ ప‌రిశీలించ‌డం కుద‌ర‌లేదు. రాజ‌స్థాన్‌లో అంత‌ర్గ‌తంగా జ‌డ్జిల బ‌దిలీ ప్ర‌క్రియ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే జోధ్ పూర్ కోర్టులోనూ జ‌డ్జిల బ‌ద‌లాయింపు సాగుతోంది. నేడు స‌ల్మాన్ బెయిల్ ప్లీ వినేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. అలాగే 51 పేజీల ఆర్గ్యుమెంట్‌తో హైకోర్టుకు వెళ్లేందుకు స‌ల్మాన్ & లాయ‌ర్ల బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది.