జుమ్లా రాజా పాలనలో అంతా నాశనమే

జుమ్లా రాజా పాలనలో అంతా నాశనమే

కేంద్రంలో అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై  ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. " అబద్దాల రాజా పాలనలో మొత్త సర్వ నాశనం" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేశం మొత్తం నిరుద్యోగం విపరీతంగా పెరిగి పోయిందని వెల్లడించారు. అందుకు తాజా ఉదహరణే ఉత్తర్ ప్రదేశ్ సంఘటన. ఆ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లాస్ ఫోర్ ఉద్యోగాలకు కూడా పీ హెచ్. డి. చేసిన వారు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక రైతులు పరిస్థితి సరే సరి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు.  రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వక, యువతకు ఉపాధి కల్పించలేక ఈ జుమ్లా రాజా అందరిని మోసం చేశారని విమర్శించారు. ఆయన పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేక పోయారని, అధికారం లోకి రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.