నిర్మాతలు చెప్పినా.. కంగన డోంట్ కేర్ అంటోంది..!!

నిర్మాతలు చెప్పినా.. కంగన డోంట్ కేర్ అంటోంది..!!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండే మనిషి.  తప్పు అని తెలిస్తే ఎక్కడికక్కడే నిలదీస్తుంది.  చెప్పాలనుకున్న విషయాన్నీ ఎవరెన్ని అనుకున్నా చెప్పే తీరుతుంది.  మణికర్ణిక సమయం నుంచి ఆమె ఇలానే ప్రవర్తిస్తోంది.  ఇప్పుడు మెంటల్ హై క్యా సినిమా కు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది.  ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను రిలీజ్ చేశారు.  

ఈ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది.  అయితే, ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా నిలదీసింది.  మాణికర్ణక రేటింగ్ విషయంలో తప్పుగా ఇచ్చారని మండిపడింది.  సదరు జర్నలిస్ట్ కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.  దీంతో జర్నలిస్ట్ గిల్డ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  క్షమాపణలు చెప్పకపోతే.. కంగనా సినిమా ప్రమోషన్ విషయంలో సహకరించేది లేదని అన్నారు.  

దీంతో ఈ మూవీ నిర్మాతలు జర్నలిస్ట్ గిల్డ్ ను క్షమాపణలు చెప్తూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.  కంగనా మాత్రం డోంట్ కేర్ అని అంటోంది.  కంగనా క్షమాపణలు చెప్పదని ఆమె సోదరి ట్వీట్ చేసింది.  మరి ఈ రగడ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.