నీలోఫర్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడి..

నీలోఫర్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడి..

హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో మరోసారి జూనియర్ డాక్టర్‌పై దాడి జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధుల నిర్వహిస్తోన్న జూనియర్ డాక్టర్‌పై ఓ బాలుడి బంధువులు దాడి చేశారని ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు జూడాలు. నీలోఫర్ సూపరింటెండెంట్ రూమ్‌లోకి వెళ్లి నిరసనకు తెలిపిన జూడాలు... తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మూడు నెలల బకాయి జీతాల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరాహార దీక్ష కూడా కొనసాగుతోండడంతో నీలోఫర్‌లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది.