చర్చలు సఫలం.. జూడాల సమ్మె విరమణ

చర్చలు సఫలం.. జూడాల సమ్మె విరమణ

తెలంగాణ జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణమే సమ్మెను విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులుగా జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. వారితో మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ చర్చలు జరిపారు. జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, వైద్య ప్రొఫెసర్ల వయో పరిమితి పెంపు తదితర డిమాండ్లతో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు.