కళ్యాణ్ రామ్ బర్త్ డే .. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

కళ్యాణ్ రామ్ బర్త్ డే .. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

నేడు హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా  సినీప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'బాలగోపాలుడు' సినిమాలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి కల్యాణ్‌రామ్‌ 2003లో 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో కెరీర్‌లో తొలి హిట్‌ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ లో అన్నకి విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ''కేవలం బ్రదర్ గానే కాకుండా గత కొన్నేళ్లుగా నాకు స్నేహితుడిగా దిశానిర్దేశకుడిగా సలహాలు సూచనలిచ్చే గైడ్ గా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్నా. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి'' అని పేర్కొన్నాడు. వీరితోపాటు పూరి జగన్నాథ్‌, వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు నటీనటులు, తదితరులు కల్యాణ్‌రామ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.