వరల్డ్‌కప్‌లో 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌'

వరల్డ్‌కప్‌లో 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌'

వరల్డ్‌కప్‌లో వారం రోజుల క్రితం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ బలోచిస్థాన్‌' అనే నినాదం ఉన్న బ్యానర్‌తో స్టేడియంపై ఓ విమానం వెళ్లగా.. ఇవాళ అటువంటి ఘటనే రిపీటైంది. లీడ్స్‌లో భారత్‌, శ్రీలంకల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' అనే  బ్యానర్‌తో ఓ విమానం స్టేడియం మీదుగా వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి రాజకీయ సందేశాల్ని ఉపేక్షించబోమని  'జస్టిస్‌ ఫర్‌ బలోచిస్థాన్‌' ఘటన జరిగినప్పుడు ఐసీసీ స్పష్టం చేయగా.. అటువంటి ఘటనే పునరావృతమవడం గమనార్హం.