హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌..

హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌..

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ సీజేగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పేరును ప్రతిపాదించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది.

జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్నారు. ఇక.. తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏఏ ఖురేషీ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.