జ్యోతి హత్య కేసు.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

జ్యోతి హత్య కేసు.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

ఏపీ రాజధాని అమరావతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి కేసులో మంగళగిరి పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దీంతో జ్యోతి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కొనసాగిస్తున్నారు. ఏఎస్పీ లక్ష్మీనారాయణ జ్యోతి బంధువులతో చర్చలు జరుపుతున్నారు. అయితే జ్యోతి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అంటున్నారు. పోలీసులపై చర్యలు తీసుకున్నామని ఏఎస్పీ బాధితులకు చెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపద్యంలో అతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత విచారిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు.