శాప్ నుంచి ప్రోత్సాహం లేదు: జ్యోతి సురేఖ

శాప్ నుంచి ప్రోత్సాహం లేదు: జ్యోతి సురేఖ

అర్జున అవార్డు సాధించినందుకు ఏపీ ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో కోత విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ. ఈ రోజు మీడియా సమావేశంలో జ్యోతి సురేఖ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కోటి రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వగా.. శాప్ అధికారులు అందులో రూ.15 లక్షలను కోచ్‌కు ఇచ్చేలా జీవో జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. తనను సంప్రదించకుండా సత్యనారాయణను కోచ్‌గా శాప్ అధికారులు ఎలా నిర్ణయిస్తారని అన్నారు. చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని.. కేవలం వార్డన్ మాత్రమేనని తెలిపారు. గతంలో రామారావు దగ్గర శిక్షణ తీసుకున్నాను.. ఇప్పుడు జీవన్ జ్యోతి సర్ శిక్షణ ఇస్తున్నారు అని చెప్పారు. క్రీడాకారిణిగా తనకు శాప్ నుంచి కనీస ప్రోత్సాహం కూడా లేకపోగా.. వేధింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఇలా అయితే భవిష్యత్తులో రాష్ట్రం తరపున ఎలా ఆడాలని ప్రశ్నించారు. సీఎం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

https://www.youtube.com/watch?v=tEyqdWf5oVo