తన ఓటమిపై తొలిసారి స్పందించిన కవిత..

తన ఓటమిపై తొలిసారి స్పందించిన కవిత..

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మరోసారి బరిలోకి దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక తన ఓటమిపై తొలిసారి స్పందించారు కవిత... తన నియోజకవర్గ పరిధిలోని మంచిప్పలో గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త  కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినా నిజామాబాద్‌ను విడిచేదిలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న కవిత.. ఈ సారి జిల్లా ప్రజలు తనను కాదని వేరే వారిని గెలిపించారు.. గెలిచిన వారు హామీలు నెరవేర్చాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చిన కవిత... ప్రజల మధ్యలో.. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.