కె. రాఘవేంద్రరావు రాజీనామా..

కె. రాఘవేంద్రరావు రాజీనామా..

ప్రముఖ సినీదర్శకుడు కె.రాఘవేంద్రరావు.. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వయోభారం వల్ల భక్తి ఛానెల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాఘవేంద్రరావు... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాజమాన్యానికి, సిబ్బందికి ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు కె. రాఘవేంద్రరావు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూ.. ఛానెల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను అప్పటి సీఎం చంద్రబాబు సూచనలతో రాఘవేంద్రరావును భక్తి ఛానెల్ చైర్మన్‌గా నియమించింది టీటీడీ.