ఈసీపై పాల్ ఆగ్రహం !

ఈసీపై పాల్ ఆగ్రహం !

ఎన్నికలు సక్రమంగా జరగలేదని సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు.  అంతేకాదు 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పుడు ఆయన బాటలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా చేరారు.  ఈరోజు ఢిల్లీ వెళ్లిన ఆయన 40 శాతం ఈవీఎం మిషన్లు పనిచేయలేదని, మిషన్లు ట్యాపరింగ్ అయ్యే అవకాశం ఉందని దీనిపై ఈసీకి పిర్యాదు చేస్తామని అన్నారు.  ఈ సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.