నాకు మద్దతిస్తే మోడీ రాకుండా చేస్తా..!-కేఏ పాల్‌

నాకు మద్దతిస్తే మోడీ రాకుండా చేస్తా..!-కేఏ పాల్‌

తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాధానం రాలేదు అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్... ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తుందని, తాను ముందు నుంచి  ఈవిషయాన్నే చెబుతున్నానని తెలిపారు. శ్రీలంక చాలా శాంతి దేశం.. అయినా, బాంబు పేలుళ్లు జరగడం దురదృష్టకరం.. ఈ పేలుళ్లలను ఖండిస్తున్నామన్నారు. ఇండియాలో మళ్లీ మోడీ ప్రధాని అయితే మన దేశంలో కూడా శాంతి ఉండదన్న కేఏ పాల్.. ఇప్పుడు నాయకులు అందరూ కలసి కష్టపడితే.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోగలం అన్నారు. “సేవ్ సెక్యులర్ ఇండియా“ నినాదంతో ముందుకు వెళ్తున్నా.. జాతీయ మీడియా కూడా నాకు మద్దతు ఇస్తే కేంద్రంలో మోడీ రాకుండా చేయొచ్చు అన్నారు. ఇప్పుడిప్పుడే లీడర్స్ అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు... కానీ, చంద్రబాబు నాయుడు సహకరించకపోవడం చాలా బాధాకరం అన్నారు పాల్... నేను నాయకత్వం వహిస్తున్నామని... చంద్రబాబు ఇతర నాయకులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు.. నాకు క్రెడిట్ వస్తుందని చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం ఈవీఎంలు ఒకేసారి ఎందుకు ఆగిపోయాయి.? అని ప్రశ్నించారు కేఏ పాల్... పేపర్ బ్యాలెట్ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.