కాలా ఫ్యాన్స్ హంగామా

కాలా ఫ్యాన్స్ హంగామా

ప్రీమియర్ షో పూర్తికాగానే కాలా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  నిన్నటి వరకు థియేటర్స్ లో టికెట్స్ ఖాళీగా ఉన్నట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు మారిపోయాయి.  థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ తో కళకళలాడుతున్నాయి.  చాలా కాలం తరువాత సూపర్ స్టార్ కు భారీ హిట్ లభించడంతో.. ఫ్యాన్స్ ఖుషీఖుషీగా ఉన్నారు.  థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ భారీ హంగామా చేస్తున్నారు.  కాలాపై రాజకీయ ప్రభావం పడుతుందని అందరు అనుకున్నారు.  అటు కర్ణాటకలో కూడా సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.  అయితే, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.  తమిళనాడుతో పాటు ఆంధ్రా, కేరళ, కర్ణాటక, ముంబై లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.