కాలాకు ఇలా కలిసొచ్చింది..!!

కాలాకు ఇలా కలిసొచ్చింది..!!

రజినీకాంత్ నటించిన కాలా సినిమా ఇటీవలే రిలీజ్ అయింది.  హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయింది.  దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడతారని అంతా అనుకున్నారు.  కాని, కాలాకు అదృష్టం శాటిలైట్ రూపంలో కలిసిరావడంతో.. నష్టాల నుంచి బయటపడింది.  

కాలా సినిమాను సన్ నెట్వర్క్ సంస్థ తెలుగు, తమిళ్, హిందీ హక్కులను దాదాపుగా రూ.60 కోట్లకు దక్కించుకుంది.  ఇంత పెద్ద మొత్తంలో కాలాను దక్కించుకోవడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించారు.