'కాలా' జూన్ కు వెళ్తుందా..?

'కాలా' జూన్ కు వెళ్తుందా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న పెద్ద సినిమాలు కాస్త ముందుకు, వెనక్కి జరిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాట జరుగుతోన్న సమ్మె కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి రాదనే వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ గా సినిమా సెన్సార్ పూర్తయిందని, ఏప్రిల్ 27న రాబోతుందని అన్నారు. ఈ సినిమా గనుక అనుకున్న సమయానికి రిలీజై.. మంచి టాక్ తెచ్చుకుంటే తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయం. కోలివుడ్ మీడియా వర్గాలు మాత్రం ఇప్పట్లో కాలా వచ్చే ప్రసక్తే లేదని అంటున్నాయి. సమ్మె కారణంగా నిలిచిపోయిన సినిమాలను క్యూ పద్దతిలో విడుదల చేయనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రజినీ సినిమా డేట్ జూన్ నాటికి వస్తుంది. స్టార్ హీరో సినిమా అని ముందుగా రజినీకాంత్ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ కోలివుడ్ లో లేదు. కాబట్టి ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!