కబీర్ సింగ్.. వసూళ్లతో పాటు వివాదాలు కూడా!!

కబీర్ సింగ్.. వసూళ్లతో పాటు వివాదాలు కూడా!!

రణబీర్ కపూర్ హీరోగా చేరిన కబీర్ సింగ్ సినిమా ఈ నెల 21 వ తేదీన రిలీజ్ అయ్యింది.  రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్లు వసూలు చేసింది.  ఫుల్ రన్ లో సినిమా ఈజీగా రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.  సినిమా వసూళ్ల పరంగా ఎంత పాపులర్ అయ్యిందో.. అటు వివాదాల విషయంలో కూడా అదే రీతిలో పాపులర్ కావడం విశేషం.  

మద్యం తాగి వైద్యం చేసే దృశ్యాలపై అభ్యంతరాలు వస్తున్నాయి. వైద్యులపై ఉన్న గౌరవం ఈ సినిమాతో తక్కువ చేసి చూపినట్టు అవుతుందని వైద్యులు అంటున్నారు.  మరోవైపు ఆడవాళ్లను తక్కువ చేసి చూపిస్తున్నారని, ఇలా చూపించడం అన్యాయం అని అంటున్నారు.