భారత్ కు నెల.. కబీర్ సింగ్ కు రెండు వారాలే..!!

భారత్ కు నెల.. కబీర్ సింగ్ కు రెండు వారాలే..!!

సల్మాన్ ఖాన్ భారత్ సినిమా ఈద్ సందర్భంగా జూన్ 5 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.  డివైడ్ టాక్ వచ్చినా సినిమా కలెక్షన్లపరంగా దూసుకుపోయింది.  25 రోజుల్లో ఈ మూవీ రూ.200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  పీరియాడికల్ జర్నీగా సినిమా తెరకెక్కింది.  స్వతంత్రం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది కథ.  

దాదాపు రెండు వారాలకు పైగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన భారత్... జూన్ 21 వ తేదీన రణభీర్ కపూర్ కబీర్ సింగ్ సినిమాతో కలెక్షన్లు తగ్గిపోయాయి.  నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది.  తాజా సమాచారం ప్రకారం 9 రోజుల్లో కబీర్ సింగ్ రూ. 160 కోట్లు కలెక్ట్ చేసింది.  మరో నాలుగైదు రోజుల్లో రూ.200 కోట్లు వసూలు చెయ్యొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.  కబీర్ సింగ్ మాస్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేస్తుండటం విశేషం.