కాచిగూడ రైల్వే ప్రమాదం...సీసీటీవీ ఫుటేజీ విడుదల

కాచిగూడ రైల్వే ప్రమాదం...సీసీటీవీ ఫుటేజీ విడుదల

కాచిగూడ రైల్వే ప్రమాదంలో సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. వేగంగా దూసుకెళ్లిన M.M.T.S ఎదురుగా వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఆ వేగానికి లోకల్ ట్రైన్‌ చివరి బోగీలు పైకి ఎగిరి పక్కకు ఒరిగిపోయాయి. ట్రైన్‌లోని ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఎదురుగా వస్తున్న  హంద్రీ ఇంటర్‌సిటీ నెమ్మదిగా వస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు పరుగులు తీసిన సమయంలో ఇతర రైళ్లు ఏవీ రాలేదు. వచ్చుంటే అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది.