కచ్చులూరు బోటు ప్రమాదం.. తలలేని మృతదేహం లభ్యం..

కచ్చులూరు బోటు ప్రమాదం.. తలలేని మృతదేహం లభ్యం..

తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ఓవైపు కాకినాడకు చెందిన సత్యం బృందం ప్రయత్నాలు చేస్తుండగా.. మరో వైపు ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. అయితే, ఆ మృతదేహానికి తలలేదు.. సిబ్బంది ఈ మృతదేహాన్ని వెలికి తీసినట్టు తెలుస్తోంది. అధికారులు ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక, బోటుకు లంగరు వేసేందుకు గజ ఈతగాళ్లు ఆక్సిజన్ మాస్క్‌లతో నదిలోపలికి వెళ్లారు. నదిలో ఉన్న బోటు పరిస్థితిని గమనించి ఆ తర్వాత బయటకు వచ్చారు గజ ఈతగాళ్లు.. ప్రస్తుతం బోటు ఉన్న పరిస్థితిని అధికారులకు వివరించారు. అయితే, కిందకు వెళ్లి లాంచీ ముందు భాగంలో లంగర్‌లు పెట్టాలనే ఆలోచనలు ఉన్నారు.