గోదావరిలో పెరిగిన ప్రవాహం.. వెనుదిరిగిన సత్యం టీమ్

గోదావరిలో పెరిగిన ప్రవాహం.. వెనుదిరిగిన సత్యం టీమ్

ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి.. దీంతో గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీసే పనులకు ఆటంకం ఏర్పడింది.. జోరువాన ఏకదాటిగా కురుస్తుండడంతో మూడో రోజూ కూడా బోటు వెలికితీసే ఆపరేషన్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇవాళ వర్షం తగ్గేలా కనిపించకపోడంతో ఆపరేషన్‌ను నిలిపివేశారు. జేసీబీలు, ఇతర సామాగ్రి ఉంచిన గోదావరి గట్టు మొత్తం చిత్తడిగా మారిపోయింది. మూడోరోజులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి చిన్న చిన్న లంగర్లతో గాలింపు చర్యలు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది అంటున్నారు ధర్మాడి సత్యం టీమ్ సభ్యులు... గోదావరిలో ప్రవాహం ఉధృతంగా ఉంటే మాత్రం ఏం చేయలేమంటున్నారు. వర్షం.. గోదావరిలో వరద ఉధృతి తగ్గింతే రేపు బోటు వెలికితీసే పనులను చేపట్టే అవకాశం ఉంది.