కడప జాయింట్‌ కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు

కడప జాయింట్‌ కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు

ఏపీలో మరో ఉన్నతాధికారిని ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేటేశ్వరరావును బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కొన్ని థియేటర్లలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడంలో కోటేశ్వరరావు విఫలమయ్యారని ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున  'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వొద్దంటూ ఈసీ స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ కడపలో కొన్ని థియేటర్లలో ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఈసీ.. జేసీ కోటేశ్వరరావును బదిలీ చేసింది.