దేశానికి కేసీఆర్ కావాలి : కడియం

దేశానికి కేసీఆర్ కావాలి : కడియం

దేశానికి కేసీఆర్ అవసరం ఎంతో ఉందని తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు.  వరంగల్ అర్బన్ జిల్లాలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్  త్వరలో పూర్తి చేస్తామని... స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న లింగంపల్లి ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.  

రైతులకు మద్దతు ధర కల్పిస్తూ, వ్యవసాయాన్ని పండుగల చేయాలని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ లాంటి పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు.  కల్యాణ లక్ష్మీ పథకం దేశ వ్యాప్తంగా అమలు కావాలని ప్రజల ఆకాంక్ష.  రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.   తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిస్తోంది.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాసిన స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం  ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా కల్పించారు.  సమర్థవంతంగా పనిచేసే కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం.  కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు.  ప్రాంతీయ పార్టీలు 200 పైగా ఎంపీ స్థానాలు వస్తాయి.  తెలంగాణలో ఎమ్ఐఎమ్  తో కలసి 17 స్థానాలు గెలుస్తాం.  కేంద్రంలో భాజాపా, కాంగ్రెసేతర ప్రభుత్వం రాబోతుంది' అంటూ ధీమా వ్యక్తం చేశారు.