పైసా ఖర్చు లేకుండా 'కంటి వెలుగు'

పైసా ఖర్చు లేకుండా 'కంటి వెలుగు'

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఆయా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలను నిర్వహించారు. వరంగల్ జిల్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ... కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే అద్బుతమైనది. రాష్ట్రంలోని చిన్న పాప నుంచి ముసలివారి వరకు మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు. కంటి వెలుగు చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వారి వద్దకే వెళ్లి పరీక్షలు చేసిన చరిత్ర గతంలో ఎక్కడైనా చూశామా?.. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మన సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఏ ఒక్క కార్యక్రమం వేరే ఏ ఇతర రాష్ట్రంలో జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి కడియం పిలుపునిచ్చారు.