కేంద్రమంత్రి జవదేకర్‌ను కలిసిన కడియం

కేంద్రమంత్రి జవదేకర్‌ను కలిసిన కడియం

ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం  ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరారు. భేటీ అనంతరం కడియం మాట్లాడుతూ... ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం ఆలస్యమైంది. 2019-20 విద్యా సంవత్సరంలో విశ్వ విద్యాలయం ప్రారంభించాలని మంత్రిని కోరాం, ప్రారంభిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని కడియం తెలిపారు.

సూపర్ న్యూమరిక్ సీట్లను ఏర్పాటు చేసి స్థానిక గిరిజనులకు న్యాయం జరిగేలా చట్టంలో ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని. గిరిజన వర్సిటీలో ఉద్యోగావకాశాలున్న కోర్సులను ప్రారంభించాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరామని కడియం వెల్లడించారు. కొత్త జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.