ఎన్టీఆర్ బయోపిక్ లో మరో సీనియర్ నటుడు
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నది. బాలకృష్ణ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్, మోహన్ బాబు, రానా, తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ సినిమాలో మరో క్యారెక్టర్ ను క్రిష్ ఈరోజు రివీల్ చేశాడు. హెచ్ ఎం రెడ్డి నిర్మించిన అనేక చిత్రాల్లో ఎన్టీఆర్ నటించాడు. ఎన్టీఆర్ నట జీవితంలో హెచ్ ఎం రెడ్డి కి ఓ ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు ఈ పాత్రలో సీనియర్ నటుడు కైకాల సత్యన్నారాయణ చేస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోను దర్శకుడు క్రిష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కైకాల సత్యన్నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిష్ ఈ ఫోటోను రిలీజ్ చేయడం విశేషం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)