మానస సరోవర్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

మానస సరోవర్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఈనెల 13వ తేదీన బయలుదేరిన వీరంతా చైనా - నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఐదు రోజులుగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామంటూ తమ కుటుంబసభ్యులకు వారు వీడియోలు పంపించారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు.