పెళ్ళికి ఇంకా టైముందంటున్న చందమామ

పెళ్ళికి ఇంకా టైముందంటున్న చందమామ

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  గత 12 సంవత్సరాలుగా కాజల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది.  ఇప్పటికే ఈ అమ్మడి వయసు 35 వరకు వచ్చింది.  కాజల్ వయసులో ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే కాజల్ మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పెళ్లి చేసుకోలేదు. కాగా, త్వరలోనే కాజల్ వివాహం చేసుకోబోతున్నట్టు ఇప్పటికే పలుసార్లు వార్తలు వచ్చాయి. కాజల్  పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త తెగ వైరల్ అయింది. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి.. అయితే ఈ అమ్మడి సన్నిహితుల దగ్గరనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో అమ్మడు పెళ్లి ఆలోచన లేదట. ఇప్పటికే ఈ అమ్మాడు ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అయిపోయింది.  ఫ్యామిలీ లైఫ్ లోకి ప్రవేశించడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్తోందట. తల్లిదండ్రులు కూడా తనను పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారని.. కాకపోతే ఇప్పటికే చాలా సినిమాలు సైన్ చేసి ఉండటంతో.. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిస్తానని అంటోందట ఈ చందమామ