కాజల్ జాక్ పాట్... ఒకే రోజు రెండు సినిమాలు

కాజల్ జాక్ పాట్... ఒకే రోజు రెండు సినిమాలు

కాజల్ అగర్వాల్ గత కొంతకాలంగా విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నది.  ఖైదీ నెంబర్ 150, నేనేరాజు నేనే మంత్రి సినిమా తరువాత ఆమెకు మరో హిట్ లేదు.  సీత సినిమా ప్లాప్ తరువాత శర్వానంద్ రణరంగం సినిమాలో ఆమె నటిస్తున్నది.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  

ఆగష్టు 2 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది.  అయితే,ఆ రోజు నుంచి ఆగష్టు 15 వ తేదీకి పోస్ట్ ఫోన్ అయ్యింది.  సాహో సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయినా సంగతి తెలిసిందే.  దీంతో ఆగష్టు 15 వ తేదీన రణరంగం సినిమాను రిలీజ్ చేయబోతున్నారట.  అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్.  అదే విధంగా కోలీవుడ్ లో కోమలి సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది.  ఒకే రోజున కాజల్ రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం.