హీరోని మాత్రం పెళ్లి చేసుకోనంటున్న కాజల్ !
స్టార్ హీరోయిన్ కాజల్ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న ఆమె పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని, ముందు సినిమాలు ఆ తర్వాతే పెళ్లి అంటోంది కాజల్. పైగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే పరిశ్రమలో ఉన్న దాదాపు అందరు హీరోలు తనకు మంచి స్నేహితులని, వాళ్లలో ఎవరిలోనూ తన జీవిత భాగస్వామిని చూడలేకపోయానని, ఒకవేళ తనకు సరిపోయే వ్యక్తి తారసపడితే ఖచ్చితంగా పెళ్లి చేసేసుకుంటానని అంది. ఇకపోతే ఈ చందమామ బ్యూటీ ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న 'ఇండియన్ 2'లో కథానాయకిగా నటిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)