కాజల్ అగర్వాల్ బిజినెస్ స్ట్రాటజీ..!!

కాజల్ అగర్వాల్ బిజినెస్ స్ట్రాటజీ..!!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... ఈ సామెతను మన హీరోయిన్లు చక్కగా ఒంటపట్టించుకున్నారు.  అందుకే వచ్చిన అవకాశలు వదులుకోకుండా నటిస్తుంటారు.  కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చిన అవకాశాలను పెద్దగా పట్టించుకోరు.  సినిమా ఫెలైతే... రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉండే హీరోయిన్లు కూడా ఉన్నారు.  అలాగే, కాస్మొటిక్ వస్తువులకు ప్రచారం చేస్తే... భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా వద్దని చెప్పి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు.  అలాంటి వాళ్ళు కళను కళలా చూసి పక్కన పెట్టేస్తుంటారు.  

కాజల్ అగర్వాల్ మాత్రం అలా కాదు.  పక్కా బిజినెస్ విమేన్.  అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా చేస్తుంది.  సినిమా మాత్రం మిస్ చేసుకోదు.  రెమ్యునరేషన్ వదులుకోదు.  రీసెంట్ గా ఈ అమ్మడు శ్రీలంక వెళ్ళింది.  అక్కడ క్యాసినోవాలో సందడి చేసింది.  క్యాసినోవాకు వచ్చేకస్టమర్స్ తో సరదాగా మాట్లాడినందుకు నిర్వాహకులు భారీగా డబ్బు ముట్టజెప్పారట.