కాజల్ అగర్వాల్ రణరంగం ఫస్ట్ లుక్

కాజల్ అగర్వాల్ రణరంగం ఫస్ట్ లుక్

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాలెంటెడ్ అండ్ సీనియర్ హీరోయిన్.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  లక్ష్మి కళ్యాణం సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  మెగాస్టార్ 150 ఆమెకు సూపర్ హిట్ ఇచ్చిన చివరి సినిమా.  మరలా తన ఖాతాలో ఆ స్థాయిలో హిట్ లేదు.  

ప్రస్తుతం తెలుగులో రణరంగం సినిమా చేస్తున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన కాజల్ ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. బీచ్ ఒడ్డున చీర్ గర్ల్ లా ఉన్న ఫోటో అది.  అటు శర్వానంద్ ఈ మూవీ లో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు.  మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆగష్టు 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.