బన్నీ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ 

బన్నీ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ 

త్రివిక్రమ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చాలా తక్కువగా ఉంటాయి.  రెగ్యులర్ ఇదే సాంగ్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు.  ఐతే, అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో త్రివిక్రమ్ ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.  ఈ సాంగ్ లో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టు సమాచారం.  

కాజల్, అల్లు అర్జున్ కలిసి ఆర్య 2 సినిమా చేశారు.  ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంది.  చాలాకాలం తరువాత బన్నీ, కాజల్ కలిసి మరలా సినిమాలో కనిపించబోతున్నారు.  ఐటెం సాంగ్ ఐనప్పటికీ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి.  మరి త్రివిక్రమ్ ఈ సాంగ్ ను ఎలా డిజైన్ చేస్తున్నారో చూడాలి.  థమన్ ఎలాంటి ట్యూన్స్ ఇచ్చారో చూడాలి.  ఆలా వైకుంఠపురంలో సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.