శంకర్ సినిమాలో కాజల్..!!

శంకర్ సినిమాలో కాజల్..!!

కాజల్ అగర్వాల్ భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నది.  కొంతకాలంపాటు సినిమాలు లేక తడబడినా.. ఇప్పుడు యువ, సీనియర్ హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.  రోబో 2 పాయింట్ ఓ రిలీజ్ తరువాత శంకర్ భారతీయుడు 2 సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయింది.  కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నట్టు తెలుస్తున్నది.  

భారతీయుడు 2 ఆఫర్ కాజల్ వద్దకు రాగానే వెంటనే ఒప్పేసుకుందట.  గతంలో ఓసారి కమల్ హాసన్ తో నటించే అవకాశం వచ్చిన.. చేయలేకపోయిందట.  ఇప్పుడు మరలా అవకాశం రావడంతో.. వెంటనే ఓకే చేసిందట కాజల్.  2 పాయింట్ ఓ రిలీజైన కొద్ది రోజుల తరువాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది.  ఇందులో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడని సమాచారం.