సొంత కుంపటి పెడతానంటున్న కాజల్ !

సొంత కుంపటి పెడతానంటున్న కాజల్ !

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాటను కాజల్ పాటిస్తోంది.  ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇలాంటి తరుణంలోనే కెరీర్లో ఇంకో స్టెప్ ముందుకు వేయాలని డిసైడ్ అయింది.  రోజూ బోలెడు కథలు వింటుంటాం కాబట్టి వాటిలో ఏదైనా మంచి కథను తానే స్వయంగా నిర్మించాలని కాజల్ భావిస్తోంది.  అందుకే సొంతగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని  అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.  మరి హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసిన కాజల్ నిర్మాతగా కూడా వియజయాన్ని చూడాలని కోరుకుందాం.  ఇకపోతే ఆమె నటించిన తాజా చిత్రం 'సీత' ఈ నెల 24న విడుదలకానుంది.