కాజల్ ను డిఫరెంట్ గా చూపిస్తున్నారా..?

కాజల్ ను డిఫరెంట్ గా చూపిస్తున్నారా..?

కాజల్ అగర్వాల్... దశాబ్దకాలం క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా ఆశించిన మేరకు హిట్ కాలేకపోయినా.. ఆ తరువాత వచ్చిన మగధీర సూపర్ హిట్ కావడంతో కాజల్ క్రేజ్ పెరిగిపోయింది.  తరువాత టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  అటు కోలీవుడ్ లోను సినిమాలు చేసింది.  కొన్నేళ్ల క్రితం కాజల్ కెరీర్ ఫేడ్ అవుట్ అవుతుంది అనుకున్నారు.  అయినప్పటికీ కాజల్ డీలా పడకుండా అవకాశాలు దక్కించుకుంది.  తిరిగి ఇప్పుడు ఫేమ్ అయింది.  

ఇప్పుడు కాజల్ భారతీయుడు 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది.  1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా భారతీయుడు 2 ను శంకర్ తీస్తున్నాడు.  కమల్ హాసన్ ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, ఈ సినిమాలో నటిస్తున్న కాజల్ కు రీసెంట్ గా మేకప్ టెస్ట్ చేశారట.  హాలీవుడ్ నుంచి వచ్చిన మేకప్ ఎక్స్పర్ట్స్ మేకప్ టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  

కాజల్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు తన మేకోవర్ లో ఎలాంటి చేంజ్ చేయలేదు.  అప్పుడప్పుడు సినిమాకు తగ్గట్టుగా కొద్దిగా హెయిర్ స్టైల్ ను మార్చడం తప్పించి.  మరి ఈ సినిమా కోసం శంకర్.. కాజల్ ను ఎలా మార్చేస్తున్నాడో తెలియాలి.  రీసెంట్ గా కాజల్ కలరియపట్టు క్రీడకు సంబంధించిన బుక్ చదువుతూ కనిపించింది.  కలరియపట్టు నేర్చుకున్న మహిళగా కాజల్ కనిపిస్తుందా చూద్దాం.