కాజల్ రిక్వెస్ట్ చేసింది... !!

కాజల్ రిక్వెస్ట్ చేసింది... !!

గత కొంత కాలంగా సినిమాలు వరసగా ఫెయిల్ అవుతున్నాయి.  ఖైదీ నెంబర్ 150 మినహా పెద్ద సినిమాలు చేతిలో లేవు.  దీంతో ఈ అమ్మడు ఇబ్బందులు పడుతున్నది.  రీసెంట్ గా రిలీజైన సీత కూడా పెద్దగా విజయం సాధించలేదు.  అయితే, సీత యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. 

ఈ సినిమాపై కాజల్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది.  కానీ, చివరకు వచ్చే సరికి పాపం ఢమాల్ అన్నది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రన్ అవుతున్నది.  చూడని వాళ్ళు అమెజాన్ లో చూడాలని రిక్వెస్ట్ చేస్తోంది కాజల్.  సినిమాలో తన నటన బాగుందని, తప్పకుండా నచ్చుతుందని అంటోంది. కాజల్ రిక్వెస్ట్ ను జనాలు యాక్సెప్ట్ చేస్తారా చూడాలి.