కొత్త కాపురానికి ఇల్లు రెడీ చేసుకుంటున్న కాజల్

కొత్త కాపురానికి ఇల్లు రెడీ చేసుకుంటున్న కాజల్

చందమామ కాజల్ తాను ప్రేమించిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడబోతుంది. కాబోయే భర్త గౌత‌మ్ కిచ్లూ ఓ బిజినెస్‌మెన్‌ అనే విషయం తెలిసిందే. ఓ ఇంటీరియ‌ర్ బిజినెస్‌కు సంబంధించిన కంపనీని ర‌న్ చేస్తున్న ఆయన తన సొంత ఇంటిని మరింత ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారట. ఈ విష‌యాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కాజల్ వెల్లడించింది. మా కొత్త ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. ఏమైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తారా..? అంటూ పోస్ట్ చేసింది కాజల్. ప్రస్తుతానికి వారి ఇల్లు అసంపూర్తిగా ఉన్నా.. భవిష్యత్ ఇంటికి సంబంధించిన ఒక స్నీక్ పీక్ ని అభిమానుల కోసం షేర్ చేశారు. అక్టోబర్ 30వ తేదీన ముంబైలో అత్యంత స‌న్నిహితుల సమక్షంలో కాజల్ వివాహ వేడుక జరగనుంది. అయితే పెళ్లి కాగానే వెంటనే తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కానుందట కాజల్.