విజయ్ ఐరన్ మాన్, మహేష్ బాబు  థోర్ !

విజయ్ ఐరన్ మాన్, మహేష్ బాబు  థోర్ !

మార్వెల్ సిరీస్ నుండి 'కెప్టెన్ మార్వెల్' పేరుతో కొత్త సినిమా విడుదలకానుంది.  ఇండియాలోని పలు భాషల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.  అందుకే ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు.  వీటిలో దక్షిణాది స్టార్ హీరోయిన్లు సమంత, రకుల్, కాజల్ అగర్వాల్, తమన్నాలు పాల్గొన్నారు.  

ఈవెంట్లో సమంత మాట్లాడుతూ తమిళంలో ఐరన్ మ్యాన్ పాత్రకు విజయ్, థోర్ పాత్రకు సూర్య బాగుంటారని అనగా తమన్నా తెలుగులో థోర్ పాత్రకు మహేష్ బాబు బాగుంటాడని అనగా కాజల్ మాత్రం అజిత్ బాగుంటారని, కెప్టెన్ అమెరికా పాత్రకు సూర్య బాగుంటాడని అంది.  ఇక రకుల్ అయితే ఐరన్ మ్యాన్ పాత్రకు సూర్య సరిగ్గా సరిపోతాడని చెప్పుకొచ్చింది.