ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి

ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి

బాలీవుడ్‌  హీరోయిన్‌ కాజోల్‌ తల్లి, సీనియర్‌ నటి తనూజా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే కాజోల్ మామ, అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.